ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో బస్సుల సమయసారిణి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజరు కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులు బయలుదేరు వేళలను ప్రయాణికులు తెలుసుకునేందుకు, ఇతర సమస్యలు ఏవైనా ఉంటే సెల్ ఫోన్ 8331033707 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.