హిందీ భాష వచ్చినవారు దేశంలో ఎక్కడైనా స్థిరపడవచ్చని అదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో హిందీ దివాస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాష ప్రాముఖ్యతను వారు తెలియజేశారు. హిందీ భాషాభివృద్ధికి శివరాం సార్, ప్రకాష్ గౌడ్ ఎనలేని సేవలు చేశారని అన్నారు.