హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఆదిలాబాద్ లోని గోపాలకృష్ణ మఠంలో ఆయన మాట్లాడారు. ఈనెల 13న గురువారం సాయంత్రం కామదాహనం, 14న శుక్రవారం హోలీ పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. హోలీ పండుగ సహజసిద్ధమైన ప్రకృతి రంగులతో మాత్రమే ఆడాలన్నారు. కెమికల్స్ రంగులను వాడవద్దని సూచించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, కందుల రవీందర్, గెడం మాధవ్, వినోద్ తదితరులున్నారు.