ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తమ గ్రామానికి చెందిన అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామానికి మంజూరైన 28 ఇండ్లలో ఒక్కటి కూడా అర్హులకు ఇవ్వలేదని గ్రామస్తులు ఆర్పించారు. వెంటనే తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.