ఇచ్చోడ: కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో ఆత్రం సుగుణక్క

81చూసినవారు
ఇచ్చోడ: కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో ఆత్రం సుగుణక్క
ఇచ్చోడ: కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. గురువారం ఇచ్చోడ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా టీపీసీసీ పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ జెండా ఎగిరిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్