జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యుడైస్ సమచారం భౌతికంగా పరిశీలించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి నారాయణ తెలిపారు. మంగళవారం నుండి ఐదు రోజుల పాటు పరిశీలన జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన పర్యవేక్షించారు. ట్రైనీ ఉపాధ్యాయులు గుర్తించిన దోషాలను వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ ఉపయోగించి యుడైస్ పోర్టల్ లో సవరించుకోవాలని సూచించారు.