సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అవగాహన, అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అడ్డుకోగలుగుతామన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే (గోల్డెన్ హవర్)లో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ కు వచ్చే అనుమానిత లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వారం 15 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు