జైనథ్ మండలం సాంగ్విలో పెనుగంగ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీ సీజ్ చేసి చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మొత్తం 12 మందిపై సెక్షన్ 3, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.