అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలి

67చూసినవారు
అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్నిమాపక సిబ్బంది నీటితో చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచురించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ జైత్రాం సూచించారు. సిబ్బంది యస్దాని తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్