అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలి

84చూసినవారు
అగ్నిమాపక శాఖ సిబ్బంది త్యాగాలను తెలియజేయడంలో భాగంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఫైర్ ఆఫీసర్ జైత్రాం పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది నీటి విన్యాసాలు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్