ఆదిలాబాద్ లోని అశోక బుద్ధ విహార్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ, రమాబాయి అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఆర్య సంఘమిత్ర ఆధ్వర్యంలో భీంరావ్ వాగ్మారే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేశారు. నాయకులు ప్రజ్ఞా కుమార్, విఠల్, దాదాసాహెబ్ జబాడే, రమాబాయి, ఉజ్వల, తదితరులు పాల్గొన్నారు.