అదిలాబాద్ లో మాదిగ సంక్షేమ సంఘం భవన స్థలంలో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. సంఘం నాయకులు గురువారం ముందుగా మైసమ్మ తల్లి విగ్రహానికి, మహాత్మా గాంధీ, అంబెడ్కర్ చిత్ర పటాలకు పూజలు చేసి, జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చందాల రాజన్న, గాలిపెల్లి నాగన్న, కొరటి ప్రభాకర్, కదరపు దేవదాస్, రాందాస్, బండారి అశోక్, మల్లేష్, ఉషన్న తదితరులు పాల్గొన్నారు.