తుడుందెబ్బ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివాసులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మావల మండలంలోని కొమరం భీం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు అన్నారు. ఆదివాసుల సమస్యల పరిష్కరించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఆదివాసి చట్టాలను కాపాడాలన్నారు.