జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని PMJANMAN పరిధిలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండి తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలన్నారు. జులై 2న మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారమ్, ఇతర వివరాలను adilabad. telangana. gov. in వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.