జైనథ్, భోరజ్, సాత్నాల మండలాల్లో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని సవారీ బంగ్లాల వద్ద కోలాహలం నెలకొంది. శనివారం ఉదయం నుంచి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సవారీలను నూతన వస్త్రాలతో అందంగా అలంకరించారు. అనంతరం హస్సేన్, హుస్సేన్ దేవస్థానం వద్ద సవారీలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మొక్కులు చెల్లించుకున్నారు.