జైనూర్ మండలం జంగాం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు షేక్ అల్తాఫ్ వివాహ వేడుకలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ఆత్రం సుగుణక్క శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్, వైస్ ఎంపీపీ చీరెలే లక్ష్మన్, జంగాం మాజీ కోప్షన్ మెంబర్ సాయద్ సజ్జద్ అలీ, కాంగ్రెస్ నాయకుడు పాల్గొన్నారు.