రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులు ముగియగా. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జైనూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల(బాలికలు)లో ఉపాధ్యాయులు కలిసి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేశారు. అనంతరం కొత్త క్లాసుల్లో వారిని స్వాగతించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన చదువు ఉంటుందని, తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.