మాజీ ఎంపీ మృతి పట్ల సంతాపం ప్రకటించిన జోగు రామన్న

65చూసినవారు
మాజీ ఎంపీ మృతి పట్ల సంతాపం ప్రకటించిన జోగు రామన్న
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మరణం తీరనిలోటని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. టిడిపి ప్రస్థానంలో రమేష్ రాథోడ్ తో కలిసి పంచుకున్న స్నేహపూర్వక సంబంధాలు ఎప్పుడు మరువలేనివని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్