ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలిని కలిసిన జర్నలిస్టులు

51చూసినవారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు షహీద్ అహ్మద్ కోరారు. ఈ విషయమై గురువారం ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబ్బీర్ ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డు అందేలా చూడాలని కోరగా షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్