ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమని మాజీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివాసులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు