సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అఖిల భారత మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయ ఆవరణలోని ఫూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. నేతలు సాంబన్న, విజయ్, ఉషన్న, తదితరులు పాల్గొన్నారు.