తెలంగాణా స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా కాంబ్లే విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా తౌటం నవీన్ కుమార్, కోశాధికారిగా అవినాశ్, ఉపాధ్యక్షులుగా మునేశ్వర్ విజయ్ కుమార్ తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. "సిపిఎస్" అంతం కోసం కృత నిశ్చయంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు అన్నారు. తమకు బాధ్యతలు అప్పగించి నందుకు రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.