ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలతో సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడడంతో అనేక మంది బాధితులు తమ కార్యాలయానికి పత్రాలతో వస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.