ఈనెల 18న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్ లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ సోడే తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ. వామన్ దాదా కర్డక్ 102వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో కవులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.