గ్రామాల్లో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపడుతూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇందులో భాగంగానే మావల మండల కేంద్రంలో ఈశ్వర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక నిమజ్జన శోభయాత్రను ఆదివారం ప్రారంభించారు. కాగా కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ డోలు వాయిద్యాలను వాయిస్తూ కళాకారులు సందడి చేశారు.