ఖానాపూర్ మండల కేంద్రంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మండలంలోని రంగాపేట కొత్తగూడెంలో గోనే స్వామికి చెందిన గుడిసెను అక్రమంగా తొలగించిన ఫారెస్ట్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీగా వెళ్లి అటవీ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో లింగన్న, ప్రసాద్, స్వామి, శేఖర్, గంగన్న, కైలాష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.