బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించరున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు రైతు రుణమాఫీ, రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతన్నల కోసం ఆదిలాబాద్ లోని రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న పోరుబాట సభకు ఆయన హాజరుకానున్నారు. కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీగా ప్లెక్సీలను, కటౌట్ లను ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దీంతో పట్టణం గులాబీమయంగా మారింది.