రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహాలక్ష్మి పథకం లో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళల ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఆయన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. మహిళా లోకానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.