మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. ఇటీవలే పదోన్నతి పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదిలాబాద్ లోని సంఘ భవనంలో శాలువతో సన్మానించి, అభినందించారు. సంఘం నాయకులు సింగరి అశోక్, బేర దేవన్న, మేకల మల్లన్న, సూరం భగవాన్, మెట్టు ప్రహ్లద్, సోమయ్య, మల్లేష్, దాసరి బాబన్న, పాశం రాఘవేంద్ర, ముచ్చరఘు, రాళ్లబండి శంకర్, పొచ్చన్న ప్రకాష్, సూరం ఆనంద్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.