గ్రేడ్ వన్ గా మారిన మున్సిపాలిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్ లో భాగంగా స్థానిక ఖానాపూర్ చెరువు ను మున్సిపల్ కమిషనర్ ఖామర్ అహ్మద్, అర్బన్ తహసిల్దార్, ఇరిగేషన్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. పట్టణంలో రూ. 320 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.