మహాత్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ అన్నారు. గురువారం సాయంత్రం మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక తత్వవేత్త జ్యోతిబాపూలే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు.