ఎంపీ స్థానం గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

51చూసినవారు
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపి స్థానాన్ని గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎన్. ఎస్. యు. ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ కేటాయించడమే నిదర్శనం అన్నారు.