గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని సంజయ్ నగర్, విద్యానగర్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆదివారం చేపట్టిన కార్యక్రమాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ గౌరీ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవికి పూజలు చేసి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. టీచర్ లు అపర్ణ, లలిత, కాలనీ మహిళలు పాల్గొన్నారు.