సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీని వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. బోరజ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీకి ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. బేషరతుగా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.