పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

54చూసినవారు
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని అదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎండి ఖమార్ అహ్మద్ పేర్కొన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని రవీంద్ర నగర్ లో పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు మున్సిపల్ వాహనంలో మాత్రమే చెత్త వెయ్యాలని సూచించారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్