బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

76చూసినవారు
ఉపాధ్యాయ, పట్టబద్రుల సమస్యల మీద ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడలేదని, వారి సమస్యలను పరిష్కరించలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్