ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే 'లక్ష డప్పులు వేయి గొంతులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ వార్డ్ మాదిగ కులస్తులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మాదిగ కులస్తులు తరలిరావాలని కోరారు. నాయకులు కె. సుదర్శన్, రాకేష్, ప్రసాద్, ప్రభాకర్, సంతోష్, జాన్సన్, పీటర్, రాఘవ, ఉదయ్, శ్రీకాంత్ ఉన్నారు