ఆదిలాబాద్: విషు పూజా ఉత్సవాలను విజయవంతం చేయండి

75చూసినవారు
ఆదిలాబాద్: విషు పూజా ఉత్సవాలను విజయవంతం చేయండి
ఆదిలాబాద్ ‌లోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 14న సోమవారం నిర్వహించే అయ్యప్ప స్వామి విషు పూజా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్