మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అడహక్ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. ఈ నెల 21 నుండి 24 వరకు నామినేషన్ల స్వీకరణ, 25న ఉపసంహరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేరోజు ఫలితాలు వెలువడిస్తామన్నారు