అక్రమంగా దేశీదారు తరలిస్తున్న ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరికి చెందిన అభిలాషను పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు సీసాలను తీసుకువస్తుండగా భీంసరిలో మంగళవారం ఆయనను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి రూ. 18 వేల విలువ గల దేశీదారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా దేశీదారు విక్రయిస్తే పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు.