ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నరేష్ సరస్వతీ దంపతులకు గత సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే భార్య భర్తల గొడవ కారణంగానే శనివారం సరస్వతీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే రిమ్స్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.