పవిత్ర శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సనాతన హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆదిలాబాద్ లోని గోపాల కృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. సెకండ్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ నికిత పంత్ పాల్గొన్నారు. వేద పండితులు మేఘరాజ్ శర్మ మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించారు.