రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగారిగూడ, జైనథ్ మండలం లేఖర్ వాడ తో పాటు తదితర గ్రామాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తో కలిసి ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు