ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో రాష్ట్ర కోటా మొదటి విడత ఎంబీబీఎస్ ప్రవేశాల్లో భాగంగా బుధవారం రెండో రోజు మరో 27 మంది ప్రవేశాలను పొందారు. ప్రవేశాలు పొందే విద్యార్థుల సౌకర్యార్ధం ధ్రువపత్రాల పరిశీలన కోసం ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. అధికారులు ధ్రువపత్రాలు పరిశీలన చేసిన అనంతరం రిమ్స్ డెరైక్టర్ రాథోడ్ జైసింగ్ విద్యార్థులకు ప్రవేశాలను కల్పించారు. ఇప్పటివరకు 51 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు