ఉట్నూర్ మాల కమిటీ ఉట్నూర్ పట్టణంలో బుధవారం మాల మహానాడు మండల నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఎస్సీల వర్గీకరణ పైఅభిప్రాయ సేకరణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉపసంఘాలకు మండలంలోని మాల, మాల అనుబంధం కుల వారు తమ అభిప్రాయ సేకరణకు సంబంధించి తప్పకుండా మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా రాసి ఎస్సిల వర్గీకరణ పై అభిప్రాయ సేకరణ ఉప సంఘానికి తెలియజేయాలని కోరారు.