ఈనెల 20న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ రాజార్షిషా ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద సభ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అధికారులతో కలసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సంస్మరణ సభకు రాష్ట్రమంత్రి సీతక్క హాజరుకానున్నట్లు తెలిపారు.