వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణమఠంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భాగవతం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. ప్రవచకులు శ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ భాగవత విశిష్టతను భక్తులకు వివరించనున్నారు. స్తానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శోభయత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు.