బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడాన్ని చూసి ఓర్వలేకనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన క్యాం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన. వ్యక్తిగతంగా తనను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుకోవచ్చని సవాల్ విసిరారు.