ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.