సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం సరైనది కాదన్నారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.